జటాయువు కృత శ్రీరామ స్తోత్రం (ఆధ్యాత్మ రామాయణం) jatayuvu krutha srirama stotram
జటాయువు కృత శ్రీరామ స్తోత్రం (ఆధ్యాత్మ రామాయణం)
అగణ్యగుణమాద్యమవ్యయమప్రమేయ-
మఖిలజగత్సృష్టిస్థితిసంహారమూలమ్ ।
పరమం పరాపరమానన్దం పరాత్మానం
వరదమహం ప్రణతోఽస్మి సన్తతం రామమ్ ॥ ౧॥
మహితకటాక్షవిక్షేపితామరశుచం
రహితావధిసుఖమిన్దిరామనోహరమ్ ।
శ్యామలం జటామకుటోజ్జ్వలం చాపశర-
కోమలకరాంబుజం ప్రణతోఽస్మ్యహం రామమ్ ॥ ౨॥
భువనకమనీయరూపమీడితం శత-
రవిభాసురమభీష్టప్రదం శరణదమ్ ।
సురపాదమూలరచితనిలయం
సురసఞ్చయసేవ్యం ప్రణతోఽస్మ్యహం రామమ్ ॥ ౩॥
భవకాననదవదహననామధేయం
భవపఙ్కజభవముఖదైవతం దేవమ్ ।
దనుజపతికోటిసహస్రవినాశం
మనుజాకారం హరిం ప్రణతోఽస్మ్యహం రామమ్ ॥ ౪॥
భవభావనాహరం భగవత్స్వరూపిణం
భవభీవిరహితం మునిసేవితం పరమ్ ।
భవసాగరతరణాంఘ్రిపోతకం నిత్యం
భవనాశాయానిశం ప్రణతోఽస్మ్యహం రామమ్ ॥ ౫॥
గిరిశగిరిసుతాహృదయాంబుజావాసం
గిరినాయకధరం గిరిపక్షారిసేవ్యమ్ ।
సురసఞ్చయదనుజేన్ద్రసేవితపాదం
సురపమణినిభం ప్రణతోఽస్మ్యహం రామమ్ ॥ ౬॥
పరదారార్థపరివర్జితమనీషిణాం
పరపూరుషగుణభూతిసన్తుష్టాత్మనామ్ ।
పరలోకైకహితనిరతాత్మనాం సేవ్యం
పరమానన్దమయం ప్రణతోఽస్మ్యహం రామమ్ ॥ ౭॥
స్మితసున్దరవికసితవక్త్రాంభోరుహం
స్మృతిగోచరమసితాంబుదకలేబరమ్ ।
సితపఙ్కజచారునయనం రఘువరం
క్షితినన్దినీవరం ప్రణతోఽస్మ్యహం రామమ్ ॥ ౮॥
జలపాత్రౌఘస్థితరవిమణ్డలసమం
సకలచరాచరజీవాన్తఃస్థితమ్ ।
పరిపూర్ణాత్మానమద్వయమవ్యయమేకం
పరమం పరాపరం ప్రణతోఽస్మ్యహం రామమ్ ॥ ౯॥
విధిమాధవశమ్భురూపభేదేన గుణ-
త్రితయవిరాజితం కేవలం విరాజన్తమ్ ।
త్రిదశమునిజనస్తుతమవ్యక్తమజం
క్షితిజామనోహరం ప్రణతోఽస్మ్యహం రామమ్ ॥ ౧౦॥
మన్మథశతకోటిసున్దరకలేవరం
జన్మనాశాదిహీనం చిన్మయం జగన్మయమ్ ।
నిర్మలం జన్మకర్మాధారమప్యనాధారం
నిర్మమమాత్మారామం ప్రణతోఽస్మ్యహం రామమ్ ॥ ౧౧॥
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment