శ్రీవేంకటేశ స్తోత్రం విత్ మీనింగ్ (కమలాకుచ చూచుక) Sri venkateshwara stotram Telugu lyrics and meaning

శ్రీవేంకటేశ స్తోత్రం విత్ మీనింగ్

శ్రీవేంకటేశ స్తోత్రం విత్ మీనింగ్ (కమలాకుచ చూచుక) Sri venkateshwara stotram Telugu lyrics and meaning

 కమలాకుచ చూచుక కుంకుమతో
నియ తారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీ భవ వేంకటశైల పతే 1


తా. లక్ష్మీదేవి కుచాగ్రము నందలి కుంకుమచే ఎఱ్ఱనైన నీలదేహము కల ఓ వేంకటేశ్వరా! కమలదళములవలె విశాలములైన కన్నులు కలవాడా! లోకములకు ప్రభువైనవాడా! శేషశైలపతీ! నీకు జయము గలుగు గాక.


స చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రము ఖాఖిలదైవత మౌళిమణే
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైల పతే. 2


తా. ఓ దేవా! నీవు బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మున్నగు సమస్త దేవతలకును నాయకుడవు. శరణాగత వత్సలుడవు. బలమునకు నిధివి. ఓ వృషశైలాధిపా! నన్ను పాలింపుము.


అతి వేలతయా తవ దుర్విషహై
రనువేలకృతై రపరాధ శతైః
భరితం త్వరితం వృషశైవ పతే
పరయా కృపయా పరిపాహి హరే. 3


తా. ఓ దేవా! హద్దులేనివియు, నీకును సహింప శక్యము కానివియు అగు అపరాధములను వందల కొలది ప్రతిదినము చేయుచున్నాను. ఇట్టి నన్ను గొప్ప దయతో వేగముగా రక్షింపుము.


అధి వేంకటశైల ముదారమతే
ర్జన తాభిమ తాధిక దాన రతాత్‌
పర దేవతయా కథితా న్నిగమైః
కమలా దయితా న్న పరం కలయే. 4


తా. జనసమూహము కోరిన దానికంటే అధికముగా ఇచ్చువాడు, వేంకటాచలమున నివసించు ఉదారబుద్ధి కలవాడు, వేదములచేత పరదేవతగా చెప్పబడినవాడు, లక్ష్మీదేవికి భర్తయు అగు వేంకటేశ్వరుని కంటె గొప్ప దైవము లేడు.


కలవేణు రవా వశ గోపవధూ
శతకోటి వృతా త్స్మరకోటి సమాత్‌
ప్రతిపల్ల వికాభిమతా త్సుఖదాత్‌
వసుదేవసుతాన్న పరం కలయే. 5


తా. మధురమైన వేణునాదము వలన పరవశత పొందిన కోట్లకొలది గోపికలచే చుట్టుకొనబడినవాడును, కోటి మన్మథుల చక్కదనము కలవాడును, గొల్లపడుచుల కందరికిని ఇష్టుడును, సుఖముల నిచ్చువాడును అగు వాసుదేవుని కంటె గొప్ప దైవము లేడు.


అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే. 6


తా. ఓ రామా! రఘునాయకా! దాశరథీ! నీవు మనోహరములైన గుణములకు నిధివి, లోకమంతటికిని సాటిలేని ధనుర్ధురుడవు. ధీరుడవు. లక్ష్మికి భర్తవు. దేవుడవు. ఓ దయాసముద్రుడా! వరములొసగి నన్నుద్ధరింపుము.


అవనీ తనయా కమనీయకరం
రజనీకర చారు ముఖాంబురుహమ్‌
రజనీచర రాజ తమోమిహిరం
మహనీయ మహం రఘురామ మయే. 7


తా. ఓ దేవా! నీవు సీతాదేవికి ప్రియుడవు. చంద్రునివలె చక్కని ముఖము కలవాడవు. రాక్షస రాజగు రావణుడనెడి చీకటిని పోగొట్టు సూర్యుడవు. మహనీయుడవు. ఓ రామా! నన్ను రక్షింపుము.


సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుఖాయ మమోఘ శరమ్‌
అసహాయ రఘూధ్వ మహన్య మహం
న కథంచన కంచన జాతు భజే. 8


తా. చక్కని ముఖము, మంచి మనస్సు, శరీరము కలవాడును, సులభుడును, సుఖముల నిచ్చువాడును, అనుకూల సోదరులు కలవాడును అగు శ్రీ రామచంద్రుని విడచి, నేను ఒకప్పుడును, ఎట్టి స్థితిలోను వేరొక దేవుని సేవింపను.


వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. 9


తా. వేంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనేలేదు. నే నెల్లప్పుడును వేంకటేశ్వరునే స్మరించుచుందును. ఓ హరీ! వేంకటేశ్వరా! అనుగ్రహింపుము. ఓ వేంకటేశ్వరా! నాకు ప్రియమును తప్పక కలుగజేయుము.


అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ. 10


తా. ప్రభుడవైన ఓ వేంకటేశ్వరా! నీ పాద పద్మములకు నమస్కరించవలెనను కోరికతో నేనెంతో దూరము నుండి వచ్చి సేవించుచున్నాను. ఒక్కసారి చేసిన సేవకు, నిత్యసేవ చేయుటవలన కలుగు ఫలములను తప్పక అనుగ్రహింపుము.


అజ్ఞానినా మయా దోషా
నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే. 11


తా. ఓ శేషశైలవాసియగు హరీ! నేను మూఢుడనై చేసిన లెక్కలేని తప్పులను తప్పక క్షమించి నన్ను రక్షింపుము.


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

శ్రీమహాచండీ అష్టోత్తర శతనామావళి sri maha chandi ashtottara satanamavali in telugu

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics