Garuda purana antargata nrusimha stotram - గరుడ పురాణ అంతర్గత నృసింహ స్తోత్రం

Garuda purana antargata nrusimha stotram - గరుడ పురాణ అంతర్గత నృసింహ స్తోత్రం

Garuda purana antargata nrusimha stotram - గరుడ పురాణ అంతర్గత నృసింహ స్తోత్రం


 నమస్తేస్తు జగన్నాథ నరసింహ వపుర్ధర |
దైత్యేశ్వరేంద్ర సంహారి నఖశుక్తి విరాజిత || 1

నఖమండల సంభిన్న హేమ పింగళ విగ్రహ |
నమోస్తు పద్మనాభాయ శోభనాయ జగద్గురో |
కల్పాంతాం భోద నిర్ఘోష సూర్యకోటి సమప్రభ || 2

సహస్ర యమ సంత్రాస సహస్రేంద్ర పరాక్రమ |
సహస్ర ధనదస్ఫీత సహస్ర చరణాత్మక || 3

సహస్ర చంద్ర ప్రతిమ సహస్రాంశు హరిక్రమ |
సహస్ర రుద్ర తేజస్క సహస్ర బ్రహ్మ సంస్తుత || 4

సహస్ర రుద్ర సంజప్త సహస్రాక్ష నిరీక్షణ |
సహస్ర జన్మమథన సహస్ర బంధమోచన || 5

సహస్ర వాయువేగాక్ష సహస్రాజ్ఞ కృపాకర | 


ఈ విధంగా స్తుతించి వినమ్రతాపూర్వకంగా శివుడు నృసింహస్వామికిలా విన్నవించాడు. ' భగవన్! అంధకాసురుని చంపడం కోసం అవసరమౌతారని నేను కొందరు మాతృకలను సృష్టించాను. ఇపుడా మాతృకలు హింసాప్రవృత్తికాకరాలై నా మాటను జవదాటి విశ్వంలోని వివిధ ప్రాణుల్ని తినేస్తున్నారు. అందుచేత వారిని సృష్టించిన నేనే మరో దారిలేక వారి సంహారానికై మిమ్ము వేడుకొంటున్నాను. వెంటనే నృసింహమూర్తి జిహ్వాగ్రభాగమునుండి సహస్ర సంఖ్యలో దేవీ స్వరూపములతో మహాశక్తులుద్భవించి ఆ మాతృకలన్నిటినీ భస్మం చేసి పారేశాయి. ఈవిధంగా నృసింహస్వామిలోకకల్యాణ కారకుడైనాడు.


ఈ నారసింహస్తోత్రాన్ని నియమపూర్వకంగా పఠించేవారి సమస్త మనోరథాలనూ శ్రీహరి నెరవేరుస్తాడు. కనులు మూసుకొని నృసింహదేవుని ఈ క్రింది రూపాన్ని ధ్యానించి చూడగలిగినవారు దైవసమానులే కాగలరు.

ధ్యానశ్లోకం
ధ్యాయే నృసింహం తరుణార్క నేత్రం
సితాంబుజాతం జ్వలితాగ్ని వక్రం |
అనాది మధ్యాంతమజం పురాణం
పరాత్పరేశం జగతాం నిధానం || 

మంచుపొరలనూ, పొగమంచునూ సూర్యుడు నాశనం చేసినట్టు ఈ స్తోత్రాన్ని భక్తిగా నియమంగా పఠించే మానవుల కష్టాలనూ పాపాలనూనృసింహస్వామి పటాపంచలు చేస్తాడు. కల్యాణ కారియైన మాతృవర్గయుక్తమైన, నృసింహదేవుని మూర్తిని నిర్మించి దానిని పూజించినవారి వెంట ఆ స్వామి నిత్యమూ నిలచి రక్షిస్తాడు.


All copyrights reserved 2012 digital media act

Comments

Popular posts from this blog

ఆంజనేయ స్తోత్రం (రంరంరం రక్తవర్ణం) sri anjaneya stotram Telugu ram ram raktha varnam

Sri venkateshwara suprabatam with Telugu lyrics and meaning శ్రీవేంకటేశ్వర సుప్రభాతం విత్ మీనీంగ్

భళిత్థా సూక్తం (యజుర్వేదం) bhalitha suktam with Telugu lyrics