భగవద్గీత ఆత్మ సంయమన యోగం bhagavadgeeta part 8 Telugu lyrics and meaning
భగవద్గీత ఆత్మ సంయమన యోగంఅథ షష్ఠోஉధ్యాయః |
శ్రీభగవానువాచ |
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః |
స సంన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః || 1 ||
శ్రీకృష్ణ భగవానుడు అంటున్నారు: - కర్మఫలంపైన ఆధారపడకుండా, చేయవలసిన కర్మని ఎవరు చేస్తారోఅతదే కర్మ సన్యాసీ, కర్మ యోగీ కూడా అగ్ని కార్యాన్నీ, కర్మనీ వదిలేసినవాడు కాదు.
యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ |
న హ్యసంన్యస్తసంకల్పో యోగీ భవతి కశ్చన || 2 ||
అర్జునా దేనిని సన్యాసమని అంటారో అదేయోగమని తెలుసుకో. సంకల్పాలను సన్యసించనివాడు ఎవడూ యోగికాలేడు.
ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే || 3 ||
యోగాన్ని అధిరోహించాలనే కోరిక ఉన్నవానికి కర్మ సాధనమని చెప్పబడుతూంది. యోగాన్ని అధిరోహించిన వానికి శాంతమే సాధనమని చెప్పబడుతుంది.
యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే |
సర్వసంకల్పసంన్యాసీ యోగారూఢస్తదోచ్యతే || 4 ||
ఎప్పుడైతే విషయ వస్తువులలోను, కర్మలలోనూ తగుల్కోకుండా సర్వ సంకల్పాలను వదిలి వేస్తాడో అప్పుడు యోగరూఢుడని పిలవబడతాడు.
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః || 5 ||
తన్ను తానే ఉద్ధరించుకోవాలి. అధోగతికి జారనివ్వకూడదు. తనకు తానే బంధువు. తనకు తానే శతృవు.
బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః |
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ || 6 ||
స్వాధీనమైన మనస్సు అతని బంధువు. స్వాధీనంలో లేని మనస్సు అతనికి శతృవై శతృత్వంతో వర్తిస్తుంది.
జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః |
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః || 7 ||
మనస్సుని జయించి ప్రశాంతంగా ఉన్నవానికి శీతోష్ణాలలో, సుఖదుఃఖాలలో మానావమానాలలో పరమాత్మ సన్నిహితంగా ఉంటాడు.
ఙ్ఞానవిఙ్ఞానతృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః || 8 ||
జ్ఞాన విజ్ఞానములతో తృప్తి చెందిన వాడు, పరమాత్మలో నిలిచినవాడు, ఇంద్రియాలను జయించిన వాడు, మట్టి, రాయి, బంగారాలని సమంగా చూసేవాడు ఐన యోగి యుక్తుడని పిలవబడతాడు.
సుహృన్మిత్రార్యుదాసీనమధ్యస్థద్వేష్యబంధుషు |
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే || 9 ||
మంచివాళ్ళు, మిత్రులు, శత్రువులు, తటస్తులు, మధ్యవర్తులు, ద్వేషించదగిన వారు, బంధువులు, సజ్జనులు పాపులు అందరి పట్ల సమభావంతో ఉన్నవాడు విశిష్టుడు.
యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః |
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః || 10 ||
ఏకాంతంలో ఉండి చిత్త ఇంద్రియాలను నిగ్రహించి, ఆశాపరిగ్రహాలను విడిచి యోగి నిత్యం మనస్సుని ఆత్మలో లయం చేయాలి.
శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || 11 ||
శుచియైన ప్రదేశాంలో అట్టే ఎత్తుగానూకాక, మరీ కిందగానుకాక, దర్బాసనం మీద లేడి చర్మం, దానిమీద వస్త్రాన్ని పరచి స్థిరమైన ఆసనాన్ని ఏర్పరచుకొని
తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియాః |
ఉపవిశ్యాసనే యుంజ్యాద్యోగమాత్మవిశుద్ధయే || 12 ||
ఆ ఆసనంపైన కూర్చుని మనస్సుని ఏకాగ్రం చేసి చిత్తేంద్రియ వ్యాపారాలను నిగ్రహించి, ఆత్మ శుద్ధికోసం యోగాన్ని అభ్యసించాలి.
సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః |
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ || 13 ||
శరీరాన్ని, మెడని, తలనీ నిటారుగా కదలకుండా నిటారుగా ఉంచి, దిక్కులు చూడకుండా తన ముక్కు కొసని చూస్తూ
ప్రశాంతాత్మా విగతభీర్బ్రహ్మచారివ్రతే స్థితః |
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః || 14 ||
ప్రశంతమైన మస్సుతో భయాన్ని విడిచి, బ్రహ్మచర్య వ్రతంలో నిలిచి, మస్సుని బాగా నిరోధించి, నాలో చిత్తాన్ని నిలిపి, నన్ను చేరాలనే లక్ష్యంతో ధ్యాన యుక్తుడై ఉండాలి.
యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః |
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగచ్ఛతి || 15 ||
మనస్సును నిగ్రహించి యోగి ఇలా ఎప్పుడూ ఆత్మ ధ్యానంలో నిలిపి, నాలో ఉన్నదీ, మోక్షరూపమైనదీ అయిన శాంతిని పొందుతాడు.
నాత్యశ్నతస్తు యోగోஉస్తి న చైకాంతమనశ్నతః |
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున || 16 ||
అర్జునా! ఎక్కువ తినేవాడికి, బొత్తిగా తినని వాడికి, ఎక్కువ నిద్ర పోయేవాడికి, అసలు నిద్రపోనివాడికి ధ్యానయోగం సాధ్యపడదు.ఎల్లప్పుడు సాత్వికాహరమునె భుజించాలి
యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు |
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా || 17 ||
ఆహార విహారాలను యుక్తంగా ఉంచుకునే వానికీ, కర్మలో తగు మాత్రంగా వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ తగుమాత్రంగా వినియోగించే వానికీ, నిద్రనూ మెళుకువనూ సమంగా పాటించే వానికీ యోగం(జన మరణ)దుఃఖాన్ని హరిస్తుంది.
యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే |
నిఃస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా || 18 ||
ఏ కామ్య వస్తువు పైనా కోరిక లేక, నిగ్రహింప బడిన మనస్సు ఆత్మలోనే ఉన్నప్పుడు అతడిని యోగ సిద్ధుడని అంటారు.
యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః || 19 ||
ఆత్మ సమ్యమ యోగాన్ని అభ్యసించే యోగి మనస్సునుని, గాలి లేని చోట ఉంచిన దీపం స్థిరంగా ఉండే స్థితితో పోల్చుతారు.
యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా |
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి || 20 ||
యోగాభ్యాసం ద్వారా నిగ్రహింప బడిన మనస్సు ఎక్కడ ఉపశమనము పొందుతుందో, ఎక్కడ తనలోతాను ఆత్మస్వరూపాన్ని చూస్తూ(యోగి) ఆనందిస్తాడ
సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః || 21 ||
ఏది బుద్ధితో మాత్రమే తెలుసుకోతగినదో, ఇంద్రియాలకు అతీతమో, అంతంలేనిదో, ఆ సుఖాన్ని యోగి ఎక్కడ ఉండి అనుభవిస్తూ, ఆ అనుభవాన్నుంచి చలించకుండా ఉంటాడో,
యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |
యస్మిన్స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే || 22 ||
దేనిని పొందిన తరవాత ఇతరమైన ఏ లాభాన్ని కూడా దానికంటే ఎక్కువ అనుకోడో, దేనిలో నిలిచి విపరీతమైన దుఃఖంచేతకూడా చలించడో,అతడె నిజమైన యోగి
తం విద్యాద్దుఃఖసంయోగవియోగం యోగసంఙ్ఞితమ్ |
స నిశ్చయేన యోక్తవ్యో యోగోஉనిర్విణ్ణచేతసా || 23 ||
దుఃఖంతో సంబంధం లేని స్థితిని యోగం అని తెలుసుకోవాలి, ఆ యోగాన్ని నిర్విచారమైన మనస్సుతో, పట్టుదలగా సాధించాలి.
సంకల్పప్రభవాన్కామాంస్త్యక్త్వా సర్వానశేషతః |
మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః || 24 ||
సంకల్పవల్ల పుట్టిన అన్ని కోరికలను పూర్తిగా విడిచి పెట్టలి. మనస్సు ద్వారానే ఇంద్రియాలన్నింటిని అన్ని వైపులనుండి నిగ్రహించాలి.
శనైః శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగృహీతయా |
ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ || 25 ||
ధైర్యంతో కూడిన బుద్ధితో నెమ్మది నెమ్మదిగా మనస్సుని(బాహ్య ప్రపంచమ్నుండి మళ్ళించి)శాంతింప చేయాలి. మనస్సుని ఆత్మలో నిలిపి తదితరమైనది ఏదీ తలచుకోకూడదు.
యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ |
తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ || 26 ||
నిలకడ లేని చంచలమైన మనస్సు ఎక్కడెక్కడికి పోతుందో, అక్కడక్కడనుండి దానిని తీసుకు వచ్చి ఆత్మలో నిలబెట్టాలి.
ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ |
ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ || 27 ||
ఈ విధంగా రజోగుణం శమించి, దోషరహితమైన, ప్రశాంతమైన మనస్సుతో కూడి బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైఅన ఉత్తమ సుఖం లభిస్తుంది.
యుంఞ్జన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః |
సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే || 28 ||
ఇలా నిరంతరం ఆత్మాభాసం చేసే యోగి యొక్క కల్మషాలు పూర్తిగా నశిస్తాయి. బ్రహ్మ స్పర్శ ఉన్న అత్యంత సుఖా న్ని తేలికగా పొందుతాడు.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః || 29 ||
యోగంతో కూడిన సర్వత్రా సమత్వాన్ని చూసే యోగి అన్ని ప్రాణులలో తననీ, తనలో అన్ని ప్రాణులనూ చూస్తాడు.
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || 30 ||
నన్ను అన్నిటిలోనూ అన్నిటిలో, నాలో అన్నిటినీ ఎవరు చూస్తారో అలాంటి వారికి నేను మరుగు కాను. అతడు నాకూ మరుగు కాడు.
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః |
సర్వథా వర్తమానోஉపి స యోగీ మయి వర్తతే || 31 ||
అన్ని ప్రాణులలో ఉన్న నన్ను అన్నింటా పరమాత్మ ఒక్కడే అన్న భావం పొంది సేవిస్తారో, ఆ యోగి ఎలా సంచరించినా నాలోనే వర్తిస్తూ ఉంటాడు.
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోஉర్జున |
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః || 32 ||
అర్జునా దుఃఖంగానీ, సుఖంగానీ తనతో పోల్చుకుని తనతో సమానంగా అందరిలోనూ చూస్తాడో, ఆ యోగి శ్రేష్టుడని నా అభిప్రాయము
అర్జున ఉవాచ |
యోஉయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన |
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్స్థితిం స్థిరామ్ || 33 ||
అర్జునుడు ఇలా అడిగాడు; - కృష్ణా నువ్వు చెప్పిన ఈ ఆత్మ సంయమ యోగం మనస్సు యొక్క చంచల స్వభావం వలన నిలుస్తుందని నాకు అనిపించడం లేదు.
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్ |
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ || 34 ||
కృష్ణా మనస్సు చంచలమైనది, భాధా కరమైనది, బలమైనదీ, గట్టిదీ గాలిని అణచడంలాగే దీనిని నిగ్రహించడం కూడా కష్టమని నేను భావిస్తాను.
శ్రీభగవానువాచ |
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ |
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే || 35 ||
శ్రీ కృష్ణా భగవానుడు ఇలా అన్నాడు: - సందేహం లేదు. మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం. అది చలిస్తుంది. అయితే కుంతీ కుమారా! అభ్యాసం చేతా వైరాగ్యం ద్వారానూ మనోనిగ్రహం సాధ్యం ఔతుంది.
అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః |
వశ్యాత్మనా తు యతతా శక్యోஉవాప్తుముపాయతః || 36 ||
మనస్సు స్వాధీనంలో లేని వాడికి యోగం పొందడం కష్టమని నా అభిప్రాయం. చిత్తం స్వాధీనంలో ఉన్నవాడు ప్రయత్నిస్తే ఉపాయంతో సాధించ వచ్చును.
అర్జున ఉవాచ |
అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః |
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్ఛతి || 37 ||
అర్జునుడన్నాడు: - శ్రద్ధ ఉన్నా మనస్సుని పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకోలేక పోయేవాడు, యోగం నుండి మనస్సు జారిపోయి యోగసిద్ధిని పొందనపుడు ఏమౌతాడు.
కచ్చిన్నోభయవిభ్రష్టశ్ఛిన్నాభ్రమివ నశ్యతి |
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి || 38 ||
ఓ మహానుభావా! బ్రహ్మ పధంలో నిలవలేని మంద బుద్ధి ఇహపరాలు రెంటికీ భ్రష్టుడై చెదిరిన మేఘంలాగా నశించి పోడా?
ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః |
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే || 39 ||
కృష్ణా! నా ఈ సందేహాన్ని సమూలంగా చేదించ తగిన వాడివి నీవే. నా అనుమానాన్ని తీర్చగలిగిన వాళ్ళు లోకంలో నీకంటే ఏవరూ లేరు.
శ్రీభగవానువాచ |
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |
న హి కల్యాణకృత్కశ్చిద్దుర్గతిం తాత గచ్ఛతి || 40 ||
శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: - అర్జునా యోగబ్రష్టుడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాశనం లేదు. నాయనా! మంచి పని చేసేవాడెవరూ దుర్గతిని పొందడు కదా.
ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః |
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోஉభిజాయతే || 41 ||
యోగబ్రష్టుడు పుణ్యలోకాలని పొంది అనేక సంవత్సరాలు అక్కడ నివసించి. తరవాత శుచివంతులు, శ్రీమంతులు ఐన వారి ఇంట్లో జన్మిస్తాడు.
అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ |
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ || 42 ||
లేదా యోగ బ్రష్టుడు జ్ఞానులైన ఇండ్లలో పుడతాడు. లోకంలో ఇలాటి జన్మ చాలా అరుదైనది.
తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ |
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన || 43 ||
కురునందనా! అక్కడ పూర్వ దేహ సంబంధమైన యోగ బుద్ధిని పొంది, ఆస్థాయి నుండే తిరిగి సంపూర్ణ యోగ సిద్ధిని పొందడానికి ప్రయత్నిస్తాడు.
పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోஉపి సః |
జిఙ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే || 44 ||
పూర్వ జన్మలో చేసిన అభ్యాసం వలన యోగ భ్రష్టుడు వివశుడై యోగం వైపు లాగబడతాడు. యోగాన్ని గురించి కేవలం కుతూహలం చూపినా, ఓంకారాన్ని జపించడం వలన లభించే వైదిక కర్మ ఫలాన్ని దాటి పోతాడు.
ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః |
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్ || 45 ||
యోగి దీక్షతో చేసే ప్రయత్నం వలన పాపాలనింటి నుండి విడివడి శుద్ధుడై, అనేక జన్మల అభ్యాసం చేత యోగసిద్ధిని పొంది పరమగతిని(మోక్షం)చేరుకుంటాడు.
తపస్విభ్యోஉధికో యోగీ ఙ్ఞానిభ్యోஉపి మతోஉధికః |
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున || 46 ||
అర్జనా! తపస్సు చేసేవారికంటే, జ్ఞానులకంటే, జ్ఞానులకంటే, కర్మచేసే వారికంటే కూడా యోగి అధికుడు. అందుచేత నువ్వూ (ఆత్మ సంయమ)యోగివి కా.
యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా |
శ్రద్ధావాన్భజతే యో మాం స మే యుక్తతమో మతః || 47 ||
యోగులందరిలో తన మనస్సుని నాలో నిలిపి శ్రద్ధగా ఎవరు సేవిస్తారో. అతడు ఉత్తముడని నాఅభిప్రాయము.
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
ఆత్మసంయమయోగో నామ షష్ఠోஉధ్యాయః ||6 ||
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment