నక్షత్ర శాంతి స్తోత్రం nakshatra santhi stotram
నక్షత్ర శాంతి స్తోత్రం
కృత్తికా పరమా దేవీ రోహిణీ రుచిరాననా 1
శ్రీమాన్ మృగశిరా భద్రా ఆర్ద్రా చ పరమోజ్జ్వలా
పునర్వసుస్తథా పుష్య ఆశ్లేషాఽథ మహాబలా 2
నక్షత్రమాతరో హ్యేతాః ప్రభామాలావిభూషితాః
మహాదేవాఽర్చనే శక్తా మహాదేవాఽనుభావితః 3
పూర్వభాగే స్థితా హ్యేతాః శాంతిం కుర్వంతు మే సదా
మఘా సర్వగుణోపేతా పూర్వా చైవ తు ఫాల్గునీ 4
ఉత్తరా ఫాల్గునీ శ్రేష్ఠా హస్తా చిత్రా తథోత్తమా
స్వాతీ విశాఖా వరదా దక్షిణస్థానసంస్థితాః 5
అర్చయంతి సదాకాలం దేవం త్రిభువనేశ్వరం
నక్షత్రమారో హ్యేతాస్తేజసాపరిభూషితాః 6
మమాఽపి శాంతికం నిత్యం కుర్వంతు శివచోదితాః
అనురాధా తథా జ్యేష్ఠా మూలమృద్ధిబలాన్వితం 7
పూర్వాషాఢా మహావీర్యా ఆషాఢా చోత్తరా శుభా
అభిజిన్నామ నక్షత్రం శ్రవణః పరమోజ్జ్వలః 8
ఏతాః పశ్చిమతో దీప్తా రాజంతే రాజమూర్తయః
ఈశానం పూజయంత్యేతాః సర్వకాలం శుభాఽన్వితాః 9
మమ శాంతిం ప్రకుర్వంతు విభూతిభిః సమన్వితాః
ధనిష్ఠా శతభిషా చ పూర్వాభాద్రపదా తథా 10
ఉత్తరాభాద్రరేవత్యావశ్వినీ చ మహర్ధికా
భరణీ చ మహావీర్యా నిత్యముత్తరతః స్థితాః 11
శివార్చనపరా నిత్యం శివధ్యానైకమానసాః
శాంతిం కుర్వంతు మే నిత్యం సర్వకాలం శుభోదయాః 12
ఇతి నక్షత్రశాంతిస్తోత్రం సంపూర్ణం
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment