వీరభద్ర దండకం shri veera bhadra dandakam in telugu lyrics
వీరభద్ర దండకం shri veera bhadra dandakam
శ్రీ భద్ర భద్రాంబికాప్రాణనాథా సురారాతిభంగా ప్రభో రుద్ర రౌద్రావతారా సునాసీర ముఖ్యామరానేక సంభావితానల్ప
సుశ్లోకచారిత్ర కోట్యర్కసంకాశ దేదీప్యమానప్రభా దివ్యగాత్రా
శివా పాలితాశేషబ్రహ్మాండభాండోదరా మేరుధీరా విరాడ్రూప వారాశిగంభీర సౌజన్యరత్నాకరా వారిదశ్యామ నారాయణధ్యేయ
మౌనీంద్రచిత్తాబ్జభృంగా సురారాతిభంగా మహోదార భక్తౌఘకల్పద్రుమా శిష్టరక్షా ప్రశస్తప్రతాపోజ్జ్వలా శ్రీకరా భీకరా భీకరాలోక చూర్ణీకృతార్యేషు దోర్దండ పాండిత్య సంరంభణోల్లాస రాజత్కరాంభోజ విన్యస్త ఖడ్గత్రిశూలాదినానాయుధా భండనాచార్య రుద్రాక్షమాలాలసద్దేహ రత్నాంచితానర్ఘ సౌవర్ణ
కేయూర భాస్వత్ కిరీటోత్తమాంగా త్రిపుండ్రాంక సర్వాంగసంశోభితా చంద్రకోటీర హేమాంబరాడంబరా దైవచూడామణీ సంతతాఖండ దీర్ఘాయురారోగ్యసౌభాగ్యసిద్ధిప్రదా దేవ తాపత్రయధ్వాంతభానూ వియత్కేశ మృత్యుంజయా దీనచింతామణీ సర్వలోకేశ లోకాత్మ లోకస్వరూపా మహాయజ్ఞవిధ్వంసనాధ్యక్ష దాక్షాయణీపుత్ర
అక్షీణపుణ్యా విభో వీరభద్రా మహాకాలరుద్రా కృపాముద్ర
మాం పాహి దీనబంధో దయావారిరాశీ లసచ్చిత్రభూషా
మహాదివ్యవేషా హరా భక్తపోషా దయావార్థి వీరేశ్వరా
నిత్యకల్యాణసంధానధౌరేయ పాపాటవీ కీల దావానలా
పుణ్యమూర్తే నమస్తే నమస్తే నమస్తే నమః
ఇతి శ్రీవీరభద్రదండకం సంపూర్ణం
All copyrights reserved 2012 digital media act
Comments
Post a Comment