షష్ఠీ దేవి స్తోత్రం తెలుగు వివరణSashti Devi stotram in Telugu lyrics and meaning
షష్ఠీ దేవి స్తోత్రం తెలుగు వివరణ రక్షరక్ష జగన్మాతః దేవి మంగళ చండికే | హారికే విపదాంరాశేర్హర్ష మంగళకారికే |1| హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళదాయికే | శుభే మంగళ దక్షే చ శుభే మంగళచండికే |2| మంగళే మంగళార్హేచ సర్వమంగళ మంగళే | సతాం మంగళదే దేవి! సర్వేషాం మంగళాలయే |3| పూజ్యే మంగళవారేచ మంగళా భీష్టదేవతే | పూజ్యే మంగళ భూపస్య మనువంశస్యసంతతమ్ |4| మంగళాధిష్ఠాతృ దేవి మంగళానాంచ మంగళే | సంసారమంగళాధారే ! మోక్ష మంగళదాయిని |5| సారేచ మంగళాధారే! పారే సర్వస్యకర్మణామ్ | ప్రతి మంగళ వారేచ పూజ్యే సర్వసుఖప్రదే |6| స్తోత్రభావము 1. ఓ జగన్మాతా! మంగళదాయినీ! ఆనందకారిణీ! ఆపదలు బాపు తల్లీ! దేవి! మంగళచండికా! నన్ను రక్షించుము. 2. ఆనంద మంగళదాయినీ! ఆనంద మంగళ ప్రవీణా! శుభమంగళ పరాయణా! శుభా! మంగళ చండికా! 3. తల్లీ! మంగళా దేవీ! మంగళయోగ్యా! సర్వమంగళ మంగళా! సాధుజనులకు శుభము లొసగు జననీ! 4. శుభమంగళనిలయా! మంగళవారపూజ్యా! మంగళాభీష్టదా! మను వంశమున జన్మించిన మంగళరాజుచే పూజలందుకొనిన తల్లీ! 5. ఓ హోమాధిష్టాన దేవీ! మంగళ మంగళా! సంసార మంగళాధారిణీ! ముక్తి మంగళ దాయినీ! మంగళకారిణీ! 6. మంగళాధారా! సర్వకర్మలకు పరాకాష్ఠయైనదాన...